TG: ఎమ్మెల్యే సంజయ్‌కి కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. తమ ఇళ్లలో కుటుంబ సభ్యులు కూర్చుని తాగే సంస్కృతి ఉందేమో? దానిని తెలంగాణ సమాజానికి అంట గట్టొద్దని విమర్శించారు. ‘తెలంగాణ ప్రజలు మీకు తాగుబోతుల్లా కనబడుతున్నారా? ఒక మహిళ అని చూడకుండా సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మాట్లాడే ముందు మెడిటేషన్ చేస్కుంటే బాగుంటుంది. మిమ్మల్ని గెలిపించిన ప్రజల పరువు తీయకండి’ అని పేర్కొన్నారు.