W.G: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో నిర్వహించిన అంతర జిల్లాల బాస్కెట్ బాల్ పోటీల్లో పశ్చిమగోదావరి బాలుర జట్టు ద్వితీయ స్థానం సాధించింది. మూడు రోజులుగా జరుగుతున్న పోటీలు సోమవారం ముగిశాయి. బాలుర తుది పోటీల్లో కృష్ణ జట్టు పశ్చిమగోదావరి జట్టుపై 42-41 స్కోరుతో విజయం సాధించింది. అనంతరం పోటీల్లో ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం సాధించిన జట్లకు మెడల్స్ అందించారు.