నైజీరియా సరిహద్దు సమీపంలోని సైనిక స్థావరంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు జరిపారు. ఈ దాడిలో 40 మంది సైనికులు మరణించినట్లు ఛడ్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఇవాళ సైనిక స్థావరాన్ని సందర్శించిన అధ్యక్షుడు మహమత్ డేబీ ఇట్నో దుండగుల కోసం సైనిక ఆపరేషన్ చేపట్టినట్లు ప్రకటించారు. ఈ ఏడాది జూన్లో దేశ రాజధాని జమేనాలో ఒక సైనిక ఆయుధాగారంలో పేలుళ్లు సంభవించి 9 మంది మరణించగా 40 మందికిపైగా గాయపడ్డారని పేర్కొంది.