‘చిరంజీవి, నాగార్జున, నాగ్ అశ్విన్ తదితరులు తమ సినిమాల్లో నన్ను భాగం చేశారు. తెలుగు చలన చిత్ర రంగంలో నేనూ సభ్యుడినే అని గర్వంగా చెప్పుకోగలను. ఇప్పటి నుంచి నన్నూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో భాగంగా పరిగణించండి. వచ్చే సినిమాలోనూ నాకు అవకాశం ఇవ్వడాన్ని మరవొద్దు. అవార్డు అందజేత విషయంలో నాకు ఈ గౌరవం కల్పించిన ANR ఫౌండేషన్, నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.