హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లిన విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు HYD విమానాశ్రయానికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో హైదరాబాద్ ఎయిర్పోర్టు అధికారులు విశాఖ విమానాశ్రయానికి సమాచారం ఇచ్చారు. అప్పటికే విశాఖ నుంచి ముంబయి బయలుదేరిన ఇండిగో విమానాన్ని అధికారులు వెనక్కి రప్పించి.. భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. విమానంలో బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.