అక్కినేని అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నన్ను సినిమా పరిశ్రమ సన్మానం చేసింది. ఆ సమయంలో అమితాబ్ నా గురించి ‘చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని చెప్పారు. ఆ మాటలు విన్నాక నాలో చిన్న వణుకు కనిపించింది. నా నోట మాట రాలేదు. నా మనసు అమితానందంతో నిండిపోయింది’ అని చెప్పారు.