AP: రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువలను సవరించాలని భావిస్తోంది. డిసెంబర్ 1 నుంచి కొత్తవిధానం అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వ్యాపార, పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న ధరలు, మార్కెట్ విలువ తదితర అంశాలపై రిజిస్ట్రేషన్ శాఖ అధ్యయనం చేస్తోంది. ఏటా పట్టణ ప్రాంతాల్లో ఏడాదికోసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి భూముల విలువలను సవరిస్తుంటారు. అలాగే, 10-20 శాతం ధరలు పెంచే ఛాన్స్ ఉంది.