TG: రాజ్ పాకాల ఫామ్‌హౌజ్‌లో సోదాలు నిర్వహించామని రాజేంద్రనగర్ DCP తెలిపారు. లోకల్ పోలీసులు, SOT, ఎక్సైజ్ పోలీసులతో కలిసి సోదాలు జరిపినట్లు వెల్లడించారు. పార్టీలో పూర్తిగా 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. 21 మంది పురుషులకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించామని, అందులో విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ వచ్చిందన్నారు. విజయ్ మద్దూరి, రాజ్ పాకాలపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు.