తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠాగా సజ్జల, వైవీ, భూమన ఉన్నారని టీడీపీ నేత పట్టాభి రామ్ వెల్లడించారు. జగన్ కుటుంబంలో జరుగుతున్న ఫ్యామిలీ డ్రామాకు చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. జగన్కు తనకు మధ్య 2019లో ఒప్పందం కుదిరిందని, ఆస్తుల విషయంలో ఎంఓయూ జరిగినట్లు షర్మిల చెప్పారని అన్నారు. వీరి మధ్య జరిగిన ఎంఓయూ చంద్రబాబు సమక్షంలో ఏమైనా జరిగిందా అని, ప్రతిసారి చంద్రబాబును ఎందుకు లాగుతున్నారని మండిపడ్డారు.