ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు స్టార్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కని విషయం తెలిసిందే. గాయం కారణంగా BCCI అతడిని ఎంపిక చేయలేదు. తాజాగా దీనిపై షమీ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్టు షేర్ చేశాడు. ‘రోజురోజుకూ బౌలింగ్‌లో ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నా. క్రికెట్ అభిమానులకు, BCCIకి నా క్షమాపణలు. త్వరలోనే రెడ్ బాల్‌తో మీ ముందుకొస్తా’ అని పోస్టులో పేర్కొన్నాడు.