ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య జరుగుతోన్న యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో హెజ్బొల్లాపై అర్జెంటీనా తీవ్ర ఆరోపణలు చేసింది. గతంలో తమ భూభాగంలో జరిగిన దాడులకు ఆ సంస్థనే ప్రధాన కారణమని ఆరోపించింది. 1992లో తమ రాజధానిలో ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయం, 1994లో యూదు కమ్యూనిటీపై జరిగిన దాడుల వెనుక హెజ్బొల్లాకు చెందిన హుస్సేన్ అహ్మద్ కరాకీ సూత్రధారిగా వ్యవహరించాడని పేర్కొంది.