ప్రకాశం: కొరిశపాడు మండలంలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లించే షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసిందని M.E.O పున్నయ్య తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 28 తేదీ నుండి నవంబర్ 11వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని పేర్కొన్నారు.