TG: హైదారాబాద్‌కు చెందిన వ్యాపారి రమేశ్‌ను భార్య నిహారిక ప్రియుడితో కలిసి హతమార్చింది. రూ.8కోట్ల ఆస్తి కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. భువనగిరిలో హత్య చేసి.. కారులో మృతదేహాన్ని కర్ణాటకలోని కొడగుకు తరలించారు. అక్కడ హర్యానాకు చెందిన రాణా అనే వ్యక్తి సాయంతో కాఫీ ఎస్టేట్‌లో మృతదేహాన్ని తగలపెట్టారు. కాఫీ తోటల్లో సగం కాలిన మృతదేహాన్ని గుర్తించి.. దర్యాప్తు చేయగా విషయం బయటపడింది.