మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ మూవీ ఈ నెల 31న విడుదలవుతుంది. ఈ సినిమా ప్రీమియర్ షోలు వేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా ప్రీమియర్ షోలను ఈ నెల 30న సాయంత్రం 6 గంటల నుంచి వేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో దుల్కర్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది.