MDK: కేంద్ర చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ కన్సల్టేషన్ కమిటీ సభ్యునిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావును నియమించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఉమంగ్ నరుల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో లోక్సభ సభ్యులు 10మంది, రాజ్యసభ సభ్యులు ఐదుగురు, ఒక ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఉంటారు. కమిటీలో స్థానం కల్పించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.