SKLM: కథా నిలయం వ్యవస్థాపకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కాళీపట్నం రామారావు (కారా) మాస్టారు శత జయంతి సదస్సు నిర్వహించనున్నట్లు సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాసు ఒక ప్రకటనలో తెలిపారు. నవంబరు 3వ తేదీన బాపూజీ కళామందిరంలో సదస్సు జరుగుతుందన్నారు. జిల్లా వాసులు పాల్గొనాలని తెలిపారు.