AP: టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. తొలి సభ్యత్వం సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. టీడీపీలో సభ్యత్వం సమాజంలో ఒక గుర్తింపు అన్నారు. టీడీపీ ఆవిర్భావంతోనే తెలుగువారికి భవిష్యత్తు అని పేర్కొన్నారు. రూ.100 సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. లోకేష్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్యకర్తల సంక్షేమంపై దృష్టి పెట్టారని చంద్రబాబు అన్నారు.