TG: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి నాలుగు రోజులపాటు మేడారం జాతర జరగనుంది. ఈ మేరకు సమావేశమైన మేడారం పూజారులు.. మినీ జాతర తేదీలను ప్రకటించారు. జాతరకు సంబంధించిన ఏర్పాటు ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయ శాఖను మేడారం పూజారుల సంఘం కోరింది.