NLR: పెళ్లకూరు మండలం నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలోని టెంకాయ తోపు గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కంటైనర్ లారీ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో కంటైనర్ లారీ డ్రైవర్ ఫిరోజ్ మంటల్లో సజీవ దహనం అయ్యాడు. కంటైనర్ లారీ ముందు భాగం కాలిపోయింది.