AP: తూర్పుగోదావరి జిల్లాలోని సరస్వతి ఘాట్లో ఆధ్యాత్మిక బస్సు యాత్రను మంత్రి దుర్గేశ్ ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. ఆధ్యాత్మిక బస్సు యాత్రలో ఒకరోజు ఆరు పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవచ్చు. కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను సందర్శించుకోవచ్చు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో గోదావరి హారతితో ఈ బస్సుయాత్ర ముగియనుంది.