తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వానల వల్ల ఏడు జిల్లాలలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చాలాచోట్ల రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మధురైలో కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.