KDP: కమలాపురం నగర పంచాయతీ వద్ద పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో డీసీసీ బ్యాంకు ఆవరణంలో శుక్రవారం అర్బన్ మార్కెట్‌ను ఎమ్మెల్యే పి కృష్ణ చైతన్య రెడ్డి ప్రారంభించారు. డాక్రా మహిళలు స్వతహాగా తయారు చేసిన పిండి వంటలను రుచి చూసి పరిశీలించారు. డ్వాక్రా మహిళల మరింత అభివృద్ధి కోసం వారికి కావాల్సిన ఆర్థిక సాయం బ్యాంకు రుణాల ద్వారా అందించాలన్నారు.