నగ్నంగా ఉండే ప్రతి పెయింటింగ్ అశ్లీలంగా ఉందని చెప్పలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ప్రముఖ చిత్రకారులు ఎఫ్ఎన్ సౌజా, అక్బర్ పదమ్సీ గీసిన నగ్న కళాఖండాలను వారికి తిరిగిచ్చేయాలంటూ కస్టమ్స్ విభాగం అధికారులను కోర్టు ఆదేశించింది. కాగా ఈ ఏడాది జూలైలో ఆ చిత్రకారులు గీసిన చిత్రాలు అసభ్యకరంగా ఉన్నాయని ముంబై కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.