ఢిల్లీ పర్యటన ముగించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌కు బయలుదేరారు. ఝార్ఖండ్ నుంచి ఉదయం ఢిల్లీకి వచ్చిన భట్టి మధ్యాహ్నం కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. ఝార్ఖండ్‌లో ఎన్నికలు, తాజా పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యవహారాలపై నివేదిక అందజేశారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించారు.