ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఫోన్-16 వాడటం, విక్రయించడాన్ని నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘మా దేశంలో ఆపిల్ సంస్థ 1.71 మిలియన్ల పెట్టుబడులు పెడుతామని, 1.48 మిలియన్లు మాత్రమే పెట్టింది. అందుకే కంపెనీపై ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపింది. అయితే వేరే దేశాల్లో కొని, తమ దేశంలో వాడుతున్న వారికి మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో అక్కడి ఐఫోన్-16 యూజర్స్ ఆందోళనకు గురవుతున్నారు.