రాజకీయాల కారణంగా కమిట్ అయిన సినిమాలను.. అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దాంతో మేకర్స్‌తో పాటు అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త నిరాశగానే ఉన్నారు. భీమ్లా నాయక్‌తో పాటు మొదలు పెట్టిన హరిహర వీరమల్లు.. ఇప్పటికే సగ భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ మిగతా షూటింగ్ మాత్రం జరగడం లేదు. చాలా రోజులుగా అదిగో, ఇదిగో అనడమే తప్పితే.. ఇప్పటి వరకు కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాలేదు. దర్శకుడు క్రిష్ ఈ సినిమా కోసం దాదాపుగా రెండేళ్లుగా వర్క్ చేస్తున్నాడు. అయినా పవన్ డేట్స్ అడ్జెస్ట్మెంట్ అవడం లేదు. దాంతో హరిహర వీరమల్లు షూటింగ్ ఇప్పట్లో కష్టమనుకున్నారు. కానీ పవన్ బస్సు యాత్ర పోస్ట్ పోన్ అవడంతో.. ‘హరిహర వీరమల్లు’ పై ఫోకస్ పెట్టారు పవన్. ఈ క్రమంలో ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది. ఇటీవలె ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం వర్క్ షాపు నిర్వహిస్తున్నట్లు దర్శకుడు క్రిష్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ వర్క్ షాప్‌లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నాడని క్లారిటీ వచ్చేసింది. ఆ వర్క్‌షాప్‌లో కీరవాణి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను కీరవాణి తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 17 నుంచి తిరిగి ప్రారంబించనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సారైనా హరిహర వీరమల్లుకు గుమ్మడికాయ కొట్టేస్తారేమో చూడాలి.