TG: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షీ.. ఆ పార్టీ నిర్వహించిన సోషల్ మీడియా వర్క్ షాప్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు ఆమె దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న దాడులను చూసి అస్సలు భయపడవద్దని.. రాహుల్ గాంధీని చూసి ధైర్యం తెచ్చుకోవాలని సూచించారు. త్వరలోనే కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ ఇస్తామని ప్రకటించారు.