కృష్ణ: గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంటేశ్వరరావుపై నమోదైన కేసును కొట్టి వేశారు. ఆయన 2021లో నియోజకవర్గ పరిధిలోని మల్లయపాలెం టిడ్కో ఇళ్లు వద్ద పనిచేస్తున్న ఉద్యోగులను అడ్డగించారని, కులం పేరుతో దూషించారన్న ఫిర్యాదుపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సాక్షులు వ్యతిరేకంగా సాక్షం చెప్పడంతో ఆ కేసు కొట్టి వేస్తూ న్యాయమూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.