కృష్ణ: గుణదలలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాల, ఆస్పత్రుల్లో పని చేస్తున్న వారిలో విధులకు ఆలస్యంగా వస్తున్న వివిధ కేడర్ కు చెందిన ఉద్యోగులు 32 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఎస్ఆర్ఎస్ అటెం డెన్స్ ఆధారంగా ప్రతి మూడు రోజుల ఆలస్యాన్ని ఒక లీవుగా పరిగణించాల్సి ఉంటుందని, మీరు ఇన్ని రోజులు ఆలస్యంగా వచ్చారంటూ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు అందజేశారు.