అమెరికా అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై 2 శాతం తేడాతో ట్రంప్ ముందజలో ఉన్నారు. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. హారిస్‌కు 45%, ట్రంప్‌నకు 47% మంది మద్దతుగా ఉన్నట్లు పేర్కొంది. సర్వే మార్జిన్ ప్లస్ లేదా మైనస్ 2.5% ఉండొచ్చని అంచనా వేసింది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి.