కృష్ణా జిల్లాలో YCP కీలక నేతలు పార్టీకి దూరం అవుతున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యేలుగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్, రక్షణనిధి.. ఎన్నికల అనంతరం కేశినేని నాని పార్టీని వీడారు. ఇటీవల సామినేని ఉదయభాను, వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సామినేని జనసేనలో చేరగా, వాసిరెడ్డి పద్మ రాజకీయ పయనంపై ఇంకా స్పష్టత రాలేదు.