TG: ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్‌పై నిషేధం విధించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. దీన్ని మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకుని తింటారు. దీన్ని తినడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురైతున్నారని.. బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం గుర్తించింది. ఆ పదార్థాన్ని నిషేధించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది.