GNTR: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (హానర్స్) వ్యవసాయం కోర్సులో అగ్రిసెట్ ద్వారా ప్రవేశాలకు ఆన్లైన్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈనెల 28 నుంచి 30 వరకు జరగనుందని యునివర్సిటీ రిజిస్ట్రార్ జి. రామచంద్రరావు గురువారం తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.