TG: కోకాపేటలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనం పైనుంచి దూకి నాగప్రభాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో నాగ ప్రభాకర్.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, అతడిని ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.