ఈ ఫొటో చూస్తే ఆకాశంలోని తెల్లని మేఘాలు నేలపైకి వచ్చినట్లు ఉంది కదూ. కానీ ఇది జలాశయంలోని నీటిపై నుంచి ఉప్పొంగిన నురగ. కర్ణాటకలోని దక్షిణ పినాకిని నదిపై హోసూరు వద్ద నిర్మించిన జలాశయంలో పెద్ద ఎత్తున నురగ ఏర్పడుతోంది. అది ఏకంగా సమీప ప్రాంతాలను కమ్మేసి రోడ్డుపైకి చేరింది. దీంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. పరిశ్రమల వ్యర్థాలు జలాశయంలో కలవటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.