AP: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్ ఫ్లో 1,59,089 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2,07,820 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగుల వద్దకు నీరు చేరింది. జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది.