AP: శ్రీశైలం దేవస్థానం ఈవో నియామకంపై వివాదం తలెత్తింది. డీసీని కాదని ఏసీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించటంతో విభేదాలు వచ్చాయి. ఆలయ ఈవోగా కిందిస్థాయి అధికారిని నియమించటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం క్రితం ఈవో పెద్దిరాజు బదిలీ అవటంతో కొత్త ఈవోని నియమించారు. కాగా.. ఈవో నియామకంలో అడ్డగోలు వ్యవహారంపై టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు.