ఫ్లోరిడాలో AI చాట్‌బాట్‌తో ప్రేమలో పడిన 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడంతో అతడి తల్లి కోర్టుకెక్కింది. చాట్‌బాట్ ‘డేనెరిస్ టార్గారియన్’తో సంభాషణ తర్వాత తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆ కంపెనీతోపాటు గూగుల్‌పైనా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. ఈ కేసుపై క్యారెక్టర్ ఏఐ ఉత్పత్తుల అభివృద్ధిలో తమ ప్రమేయం లేదని గూగుల్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.