W.G: ఆచంట మండలం శేషమ్మ చెరువు గ్రామ పరిధిలో జూద శిబిరంపై గురువారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 11మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై కె. వెంకటరమణ తెలిపారు. వారిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.24,500 స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.