AP: విశాఖలోని అరకు లోయ ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. అక్కడ మరో మేఘాల కొండ కనువిందు చేస్తోంది. లంతంపాడు సమీపంలో కొండలపై పొగమంచు సోయగాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పచ్చని కొండల నడుమ పాలసముద్రం ప్రవహిస్తుందన్నట్లుగా ఉన్న రమణీయ దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. కొండపై నుంచి పొగమంచు చేసే కణికట్టు మరో అద్భుత ప్రపంచాన్ని తలపిస్తోంది.