KDP: మా డివిజన్లలో సమస్యలను పరిష్కరించాలని కడప కార్పొరేటర్లు పాకా సురేశ్ కుమార్, బాలస్వామిరెడ్డి, ఎస్ఎ.షంషీర్ కడప నగరపాలక సంస్థ నూతన కమిషనర్ మనోజ్ రెడ్డికి గురువారం విన్నవించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆయనను కలిసి మొక్క అందజేశారు. డివిజన్ సమస్యలను వారు విన్నవించారు. పెండింగ్లో ఉన్న రోడ్డు వెడల్పు, డ్రైనేజ్ నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు.