మరో హమాస్ కమాండర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 7 నాటి దాడుల వెనుక అతని ప్రమేయం ఉందని వెల్లడించింది. అంతేకాకుండా మృతుడు ఐక్యరాజ్యసమితి సహాయ ఏజెన్సీ కోసం కూడా పని చేస్తున్నారని తెలిపింది. గతంలో UN ఏజెన్సీలోని సభ్యులు హమాస్, ఇతర సాయుధ బృందాల్లో పనిచేస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీంతో అప్పుడే అక్టోబర్ 7న జరిగిన దాడుల్లో పాల్గొన్న 9 మందిని UN తొలగించింది.