TG: సీఎం రేవంత్ రెడ్డి ఘడియకు ఒక మాట మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి అన్నారు. పేదల ఇల్లు కూల్చి.. పెట్టుబడిదారులకు వత్తాసు పలకడం ఏంటి? అని నిలదీశారు. అధికారంలోకి రాకముందు ఒక మాట.. వచ్చాక ఒక మాట ఇదేంటి? అంటూ ప్రశ్నించారు. తాను ఇచ్చిన మాటలు తన నియోజకవర్గంలో నెరవేరుస్తానని చెప్పారు. పేద ప్రజల జోలికి వస్తే బీజేపీ ఊరుకోదని.. నిర్వాసితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.