KRNL: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి మరో గౌరవ ఆహ్వానం అందింది. 79వ యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు అమెరికా న్యూయార్క్ నగరంలో నవంబర్ 18- 22 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఎంపీ శబరికి దక్కింది. భారతదేశ ప్రతినిధిగా మాట్లాడేందుకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.