NLR: మనుబోలు జాతీయ రహదారిపై ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. యాచవరానికి చెందిన కుడుముల మల్లికార్జున బైక్ మీద వెళ్తుండగా నెల్లూరు వైపు నుంచి చెన్నై వెళ్తున్న మినీ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనుబోలు SI కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.