AP: వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తాడిపత్రి అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పెద్దారెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 11కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.