AP: కుటుంబ ఆస్తుల వ్యవహారంపై మాజీ సీఎం జగన్ తొలిసారి స్పందించారు. తమ కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా? అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాలన వదిలేసి డైవర్షన్ కోసం తల్లి, చెల్లి గురించి ప్రచారం చేస్తారా? అని నిలదీశారు. ఇవన్నీ అన్ని ఇళ్లలో ఉండేవే అని.. వాటి గురించి ప్రచారం ఆపి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని సూచించారు.