వయసు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే అనేక మార్పులతో పాటు చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. దీంతో చర్మంపై ముడతలు, సన్నని గీతలు ఏర్పడతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు, టమాటా, బ్లూబెర్రీలోని పోషకాలు చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. డార్క్ చాక్లెట్లు, వాల్ నట్, బాదం, పెరుగు, గుడ్లు ఆహారంలో చేర్చుకోవాలి. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవాలి.