SKLM: అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో 2025 ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు.