సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు జ్ఞానవేల్ కాంబోలో తెరకెక్కిన ‘వేట్టయాన్’ మూవీ అక్టోబర్ 10న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందట. నవంబర్ 7 నుంచి సదరు సంస్థలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.